Sandra Venkata Veeraiah: మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి.. కర్ణాటకలో ఉన్న వాళ్ళు మోసపోయారని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ 23 వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పనిచేశానని అన్నారు. ప్రతి వ్యాపారస్తుడు, ఉద్యోగస్తులు స్వేచ్చగా పనిచేసుకునే వాతావరణం కల్పించామన్నారు. ఎవర్ని ఇబ్బందులకు గురి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. సాధారణ కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ఖమ్మం తర్వాత అభివృద్ది చెందిన నగరంగా సత్తుపల్లి నిలిచిందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు కెసిఆర్ ఇవ్వలేదని తెలిపారు. 1.20 లక్షల కుటుంబాలకు భీమా కల్పిస్తుందన్నారు. కుటుంబంలో కష్టం వస్తె మీకు దైర్యం కలిగించడానికి కెసిఆర్ భీమా ప్రవేశ పెట్టారని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండని, కర్ణాటకలో ఉన్న వాళ్ళు మోసపోయారన్నారు.
కర్ణాటకలో మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళని ఎన్నుకోవాలని సూచించారు. న్యాయ నిర్ణేతలు మీరే అభివృద్ది చేసే పార్టీని గెలిపించాలన్నారు. అర్హులైన ప్రతి పేద మహిళకు రూ.3000 జీవన భృతి, రూ.400లకే వంటగ్యాస్, వికలాంగులకు ఆసరా పింఛన్ల పెంపు వంటి పథకాలను ప్రజలకు వివరించారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలు మించి పెన్షన్ ఇవ్వలేదని, కేవలం 10 సంవత్సరాల పాలనలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 2,116 చేశారని గుర్తు చేశారు. పెద్ద మనస్సుతో దివ్యాంగులు 4,016 ఇస్తున్నారని అన్నారు. వచ్చే సంక్రాంతి నుంచి ఇప్పుడు ఇస్తున్న పింఛనుకు మరో 1000 రూపాయలకు పెంచి 3,016 ఇచ్చే విదంగా, ప్రతి ఏడాది పెంచుతూ 5 ఏండ్లలో 5016 రూపాయలు, దివ్యంగులకు 6,016 ఇచ్చే చేసే గొప్ప పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ 22,23 వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన కారు గుర్తు పై ఓటు వేసి సత్తుపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించాలని కోరారు.
Mallikarjun Kharge: ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే గెలుపు.. బీజేపీకి అంత సీన్ లేదు..