Site icon NTV Telugu

మా ఎన్నికల పోలింగ్ వివాదంపై రోజా కామెంట్ !

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగలేదని చెప్పారు. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను నమ్మనని…ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలేనని చురకలు అంటించారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదేనన్నారు రోజా. ఎవరు గెలిచినా మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా. రెండు ప్రభుత్వాలు సినిమా కార్మికులకు అండగా ఉండాలని కోరారు రోజా. కాగా.. ఇప్పటి వరకు మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నిక లో 280 కి పైగా ఓట్లు పోల్‌ అయినట్లు సమాచారం అందుతోంది.

Exit mobile version