వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని అభివృద్ధి ముందు ఉంచుతా అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. అనంతరం.. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నా నాలుకపై మచ్చలు ఉన్నాయి నేనేమంటే అదే జరుగుతుంది గతంలో ఇదే స్థలంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని అంబేద్కర్ సాక్షిగా చెప్పానన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యారని, ఇదే స్థలంలో ఇదే అంబేద్కర్ సాక్షిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడన్నారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి పది సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆర్టిఐ కింద అప్లై చేస్తే ఏడు లక్షల ఉద్యోగులు మాత్రమే ఇచ్చారు 20 కోట్లు ఎక్కడ ఏడు లక్షలు ఎక్కడ బిజెపి పార్టీకి సిగ్గు ఉండాలన్నారు.
అంతేకాకుండా..’రైతుల పెట్టుబడులను రెండింతలు చేస్తానన్న మోడీ నల్లచెట్లను తెచ్చి రైతులను మోసం చేశాడు. రాహుల్ గాంధీ రైతుల పక్షాన నిలబడి బిజెపి తీసుకువచ్చిన చట్టాలను మళ్లీ వాపస్ తీసుకునేలా చేశాడు రాహుల్ గాంధీ… అవివేకంతో ఆలోచన లేకుండా రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుంది ప్రజలు గుర్తించుకోవాలి… నిన్న చేవెళ్ల గడ్డపై వచ్చి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇష్టానుసారంగా మాట్లాడారు… రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి ఎలాంటి వాడో మేము కూడా అలాంటి వాళ్ళమే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం… రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతుబంధు 93% పూర్తి చేశాం. ఏడు లక్షలతో కోట్లతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పాడు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాణహిత చేవెళ్లను సాంక్షన్ చేయించుకుంటే మా నోట్ల మట్టి కొట్టి ప్రాణేత చేయవలెను న రద్దు చేయించావు… చేవెళ్ల పార్లమెంటు ని మోసం చేశావు చేవెళ్ల పార్లమెంట్లో నిన్న మీటింగ్ పెడితే నిన్ను ఎవరు ఆదరించటోడు కనపడలేడు. పొద్దు తిరగని పువ్వాని రంజిత్ రెడ్డిని విమర్శించావు ఒకప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాడివే.. కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఎన్నో పార్టీలు మారి ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు.. కాసాని గుండెల్లో నుంచి వచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నాడు… చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ గెలుపుకి పరిగి నియోజకవర్గం నుంచి అతిగ మెజారిటీ పిచ్చి రంజిత్ రెడ్డి ని గెలిపిస్తాం’ అని రామ్మోహన్ రెడ్డి అన్నారు.