Site icon NTV Telugu

MLA Raja Singh : తెలంగాణలో షోప్ టాప్ తప్పితే.. ఇండ్లు కూడా ఇవ్వడంలేదు

Mla Rajasingh1

Mla Rajasingh1

డబుల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల రెండో విడుత పంపిణీ జరిగిందని, కేటీఆర్.. ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మీరు తెలంగాణలో ఎంతమందికి ఇండ్లు ఇస్తున్నారని ప్రశ్నించిన రాజాసింగ్‌.. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా అన్నారు. ఒకసారి తెలుసుకోండని, 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందన్నారు. కానీ లక్ష ఇండ్లు కూడా కట్టలేదని ఆయన హెద్దేవ చేశారు. తెలంగాణ ప్రజలు ఇండ్లు కావాలని అంటున్నారని, మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూం ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం అని, మీరు మంచి చేస్తే ప్రజలు మీకే ధన్యవాదాలు చెబుతారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. 25 లక్షల మందకి పైగా ప్రజలు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారని, అందులో ఎంతమందికి కేసీఆర్ సర్కార్ ఇండ్లు ఇస్తుందో చెప్పాలన్నారు రాజాసింగ్‌.

Also Read : Shruti Hasan : ఎయిర్ పోర్ట్ ఘటన గురించి స్పందించిన శృతి హాసన్..

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఇండ్లు ఎక్కడా కట్టలేదని కేటీఆర్ చెబుతున్నారని, యూపీలో సింగిల్ బెడ్రూం ఇండ్లు 15.70 లక్షల ఇండ్లు, మధ్యప్రదేశ్ లో 7 లక్షల 80 వేల ఇండ్లు, మహారాష్ట్రలో 11 లక్షల 70 వేల ఇండ్లు, గుజరాత్ లో 6 లక్షల 40 వేలు, హర్యానా 2 లక్షల 65 వేల ఇండ్లు, అస్సాంలో 1 లక్ష 55 వేల ఇండ్లు కట్టించి ఇచ్చారన్నారు. రెంట్ కట్టి కట్టి, గుడిసెలో ఉండి ఇబ్బందులు పడుతున్నారని, డబుల్ ఇండ్ల సంగతి పక్కన పెడితే.. సింగిల్ బెడ్రూం ఇండ్లు అయినా ఇవ్వండని ప్రజలు మొత్తుకుంటున్నారన్నారు. తెలంగాణలో షోప్ టాప్ తప్పితే.. ఇండ్లు కూడా ఇవ్వడంలేదు.. కట్టి వదిలేస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇండ్లు మీరు ఎన్ని కడుతారో కట్టి ఇవ్వండి.. దాంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింది సింగిల్ బెడ్రూం ఇండ్లయినా కట్టించి ఇవ్వండి అని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Krishna District: అయ్యంకిలో భగ్గుమన్న పాతకక్షలు.. భార్యాభర్తలు దారుణ హత్య

Exit mobile version