NTV Telugu Site icon

Raja Singh : దీపావళి పటాకుల పైన లక్ష్మీ దేవి బొమ్మ పెట్టి అమ్ముతున్నారు.. ఇదో కుట్ర : రాజాసింగ్

Mla Rajasingh

Mla Rajasingh

Raja Singh : దేశమంతా దీపావళి పండుగ ఘనంగా జరుపుకుంటుంది. చిన్నపెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అలాగే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘‘ నమస్కారం మిత్రులారా.. నేను మీ రాజాసింగ్.. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు దీపావళి పండుగ మనం జరుపుకుంటున్నాం. ఈ దీపావళి పండుగ రోజు చాలా పెద్ద ఎత్తున పటాకులు తెప్పించి కాలబెడుతున్నాం. కానీ కొద్దిగా జాగ్రత్త. చిన్న చిన్న పిల్లలు ఉంటారు.

Read Also:HIV cases: వామ్మో ‘‘పులిరాణి’’.. ఒక మహిళ నుంచి పలువురికి హెచ్ఐవీ..?

వారికి ఏ పటాకాలో ఎంత పెద్ద బ్లాస్ట్ ఉంటుందో వారికి తెలియదు. అందుకే మన పిల్లల వెంట ఉండి పటాకులు కాలబెట్టాలని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా చాలా పెద్ద కుట్ర.. ఒకప్పుడు జరిగిన కుట్ర కంటిన్యూగా అదే విధంగా జరుగుతుంది. దీపావళి అంటే మనం లక్ష్మీ మాతాకు పూజ చేస్తాం. అదే పటాకాలో మన లక్ష్మీ మాత బొమ్మ పెట్టి అమ్ముతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర నడుస్తోంది. మనమంతా కలిసి దేవుడి బొమ్మ ఉన్న పటాకులు కొనవద్దు. కాల్చవద్దు. వచ్చే ఏడాది ఎవరూ లక్ష్మీ దేవీ బొమ్మ ఉన్న పటాకులు తయారు చేయరు.. కొనరు. ఈ విధంగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటున్నాను. మరొక్క సారి దీపావళి శుభాకాంక్షలు.’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read Also:Biahr : రెండుగా విడిపోయిన గూడ్స్ రైలు.. ఆందోళనతో జనాల కేకలు