Site icon NTV Telugu

MLA Wife Digital Arrest Scam: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ కేసును ఛేదించిన పోలీసులు..

Digital Arrest Scam

Digital Arrest Scam

MLA Wife Digital Arrest Scam: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య డిజిటల్ అరెస్ట్‌ మోసానికి గురైన సంఘటన కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు తమను సీబీఐ, బ్యాంక్ అధికారులు, పోలీసులుగా పరిచయం చేసుకుంటూ భారీ మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఎమ్మెల్యే భార్య ఫోన్‌కు కాల్ చేసిన మోసగాళ్లు, ఆమె పేరు మనీ లాండరింగ్ కేసులో ఉందని, విచారణ పూర్తయ్యే వరకు ఫోన్‌ను ఆఫ్ చేయకుండా వీడియో కాల్‌లో ఉండాలని ఆదేశించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ, ఆమెను మానసికంగా భయపెట్టి “డిజిటల్ అరెస్ట్” పేరుతో భారీ మొత్తాలను ట్రాన్స్‌ఫర్ చేయించారు.

Read Also: Delhi Car Blast: వెలుగులోకి సంచలన విషయాలు.. కర్త.. కర్మ.. క్రియ షాహీనానే!

దీంతో, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ .. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. నిందితుల్లో ఢిల్లీకి చెందిన IDFC బ్యాంక్ మేనేజర్ ఉండడం సంచలనంగా మారింది.. కాగా, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో పుట్టా సుధాకర్ యాదవ్ నుండి 1 కోటి 70 లక్షలు రూపాయలు కాజేశారు సైబర్ నేరస్తులు.. సాధారణ ప్రజలు ఇలాంటి మోసాలకు బలి కాకూడదు. ఇది ఎంత ప్రమాదకరమో అందరూ తెలుసుకోవాలి. న్యాయం జరిగే వరకు పోరాడుతాను అని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.

Exit mobile version