NTV Telugu Site icon

MLA Padma Devender Reddy: వరదల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

Mla Padma Devender Reddy

Mla Padma Devender Reddy

మెదక్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వెంకటరమణ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. వరద సహాయక చర్యలు పరిశీలించారు. వరద నీటిని తొలగించేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదనీరు చేరి సహాయం కోసం వేచిచూస్తున్న స్థానికులకు వంట సామాగ్రిని అందించారు. అక్కడున్న ప్రాంతాల్లో ఆమె పరిశీలిస్తున్న నేపథ్యంలో వరదలో చిక్కుకుపోయారు. దీంతో అధికారులు స్పందించి జేసీబీ సహాయంతో ఆమెను అక్కడనుంచి బయటకు తీసుకువచ్చారు.

నిన్నటి నుంచి కురుస్తున్న వానలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. వాగులు, వంగలు, ప్రాజెక్టులు నిండటంతో జనావాసంలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు వీలైనంత సహాయం చేస్తూ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈవానలు ఇంకా రెండు రోజులు కురుస్తాయన్న నేపథ్యంలో.. అధికారులు ప్రజలను అలర్ట్‌ చేసారు. బయటకు రాకుండా తగిన జాత్ర్తలు చేసుకోవాలని సూచలు జారీ చేసారు.