NTV Telugu Site icon

Namburu Sankar Rao: రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తా..

Nambur

Nambur

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగానే.. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్లే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు, తాను చేసిన అభివృద్ధి తన విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

TS TET: తెలంగాణ టెట్ పరీక్షలలో స్వల్ప మార్పులు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..

మరోవైపు.. రూ. 150 కోట్లతో బెల్లంకొండ, అమరావతి రహదారి నిర్మించాలన్న తన ధ్యేయం నెరవేరిందని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తెలిపారు. భవిష్యత్తులో రూ. 60 కోట్లతో కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. అచ్చంపేట నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి అందుతున్న పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఆలోచనతోనేనని.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన సంస్కరణలు పేదవాడి జీవితంలో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేయటానికి సిద్ధమయ్యారని.. పెదకూరపాడులో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లు నెలకొల్పి, ఇక్కడ యువతకి ఉపాధి కల్పించాలన్నదే తన ధ్యేయమని చెప్పారు.

Prajwal Revanna s*x scandal: రేవణ్ణ సె*క్స్ స్కాండల్ వీడియోలు ఎక్కడ..? ఆన్‌లైన్‌లో తెగవెతుకుతున్న జనాలు..