55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. జడ్చర్లలోని ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముస్లిం సోదరులు వేలాదిగా తరలి వచ్చారు.
Read Also: Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీలకు షాదీ ముబారక్, ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం, మైనార్టీ ఓవర్సీస్ పథకం, మైనార్టీ బంధు, ప్రత్యేక మైనార్టీ గురుకులాలు లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుందని విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ.. గంగా జమున తెహజీబ్ కా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి.. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని కొనసాగించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.