NTV Telugu Site icon

KP Nagarjuna Reddy: ఎస్టీ కాలనీ వాసుల కరెంట్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

Kp Nagarjuna

Kp Nagarjuna

Prakasam: మార్కాపురం పట్టణంలోని 15వ వార్డులో సుమారు 30 సంవత్సరాల నుంచి జంగాళవారు నివాసముంటున్నారు వారికి విద్యుత్ స్థంబాలు లైట్లు లేక కటిక చీకట్లో జీవిస్తున్నారు. అయితే, ఈ మధ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఎస్టీ కాలనీకి వెళ్ళేటప్పటికి రాత్రి సమయం కావడంతో అంతా చీకటిగా ఉన్నది.. స్థానిక ప్రజలను పిలిచి ఇంత చీకటిగా ఉంది.. ఎలా ఉంటున్నారు అని అడుగగా గత పాలకులకు అర్జీలు ఇచ్చినా ఉపయోగం లేదు.. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని స్థానికులు చెప్పారు. దీంతో వారి ఇబ్బందులు చూసిన మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి త్వరలో మీ సమస్య తీరుస్తా అని మాటిచ్చారు.

Read Also: MLA Yatnal: 40,000 కోట్ల కోవిడ్ కుంభకోణంలో యడ్యూరప్ప ప్రమేయం ఉంది..

ఇక, వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్త లైన్లు లాగి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడంతో కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. దీంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి జంగాళవారు కాలనీ వాసులు అందరూ ధన్యవాదాలు తెలిపి నీ మేలు మరువము నీకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ బాల మురళీ కృష్ణ, పట్టణ కన్వీనర్ & వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, కౌన్సిలర్ హర్షిత బాబి, సుంకయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.