ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గో సంపదను సంరక్షించాలన్న సంకల్పంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చేసిన కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురానికి గోశాలను కేటాయించారు. లక్ష్మీ చెన్నకేశవ గోశాల కమిటీ సభ్యులందరితో ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపి మార్కాపురం ప్రాంతంలో గోశాల నిర్మాణం చేయడం ద్వారా అనేకమంది భక్తులకు సెంటమెంటల్ గా బాగుంటుందని తెలిపారు. అంతేకాకుండా.. వీధుల వెంట తిరుగుతున్న ఆవులు ప్రజల జీవనానికి అనేక ఇబ్బందులు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే వారికి చెప్పారు. ఈ గోశాల కమిటీ ద్వారా మార్కాపురం పట్టణంలో ఉన్న వీధుల్లో జరిగిన ప్రమాదాలు, తీవ్ర రక్త గాయాలైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కొద్దో గొప్పో తమ వంతు సేవను అందించారు.
Laxman: ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం మోదీ ఆలోచిస్తుంటారు..
తీవ్రమైన అనారోగ్యానికి గురైన గోమాతలకు ఏకంగా ఎమ్మెల్యే దగ్గరుండి వాటికి శస్త్ర చికిత్సలు కూడా చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రత్యక్షంగా మార్కాపురం పట్టణంలో వీధుల వెంట తిరుగుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తూ.. ఎక్కడబడితే అక్కడ మల మూత్రాలు విసర్జన చేస్తున్నాయి. అంతేకాకుండా వాటి ద్వారా ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరికొన్ని పరిస్థితుల్లో వాహనాలు గోమాతలు ఢీకొనడం వలన అవి గాయపడి ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వంతో అనేక స్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడారు. కొండేపల్లి దారిలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి భూమిలో గోశాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సంకల్పించారు. ఆ కృషి ఫలితంగా నేడు గోవులకు రక్షణ కోసం ఒక గోశాలను ఏర్పాటు చేయబోతున్న సందర్భాన్ని మార్కాపురం ప్రజలు ఎంతో సంతోషంతో ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.
Venkat: OG బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్.. అంచనాలు ఇంకా పెంచేసిన హీరో..