KP Nagarjuna Reddy: ఈ సారి అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు.. నదులు, ప్రాజెక్టుల్లో కావాల్సినంత ప్రవాహం కూడా లేదు.. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.. అయితే, సాగర్ నీళ్ల గురించి దర్శిలో అధికారులను ఆరా తీశారు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. పొదిలికి సాగర్ జలాలు ఎందుకు పుష్కలంగా ఇవ్వడం లేదనే విషయం గురించి దర్శి సాగర్ నీటి ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడారు నాగార్జునరెడ్డి.. దర్శి సాగర్ కెనాల్ వద్దకు వైసీపీ నాయకులతో కలిసి నీటి శాతం ఎంతమేరకు ఉందనే విషయాన్ని పరిశీలించారు. ఇక, డీఈ, ఎస్ఈలతో మాట్లాడి పొదిలికి రావాల్సిన వాటా సంతృప్తికరంగా అందించాలని ఒప్పందం చేసుకున్నారు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. ఇక, ఈ కార్యక్రమంలో పొదిలి మండలం వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. మరోవైపు.. ఇప్పటికే ఉన్న నీటిని వివిధ కాల్వలకు, రిజర్వాయర్లకు తరలించే ప్రయత్నాలు కూడా అధికారులు ప్రారంభించిన విషయం విదితమే.