ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.
తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు:
1.మహమ్మద్ మహమూద్ అలీ
2.సత్యవతి రాథోడ్
3.శేరి సుభాష్ రెడ్డి
4.ఎగ్గే మల్లేశం
5.మీర్జా రియాజుల్ హాసన్
ఏపీ నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు:
1. జంగా కృష్ణమూర్తి
2. దువ్వాడ రామారావు
3. పరుచూరి అశోక్ బాబు
4. బి తిరుమల నాయుడు
5. యనమల రామకృష్ణుడు