Site icon NTV Telugu

Galla Madhavi: ఎమ్మెల్యే వినూత్న నిరసన.. రోడ్డుపై ఉన్న గుంతలను స్వయంగా పూడ్చిన వైనం..!

Galla Madhavi

Galla Madhavi

Galla Madhavi: గుంటూరు నగరంలోని కీలకమైన జీటీ రోడ్డులో గుంతలు పెరిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదవి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో స్వయంగా రోడ్డుపైకి దిగిన ఆమె, కార్యకర్తలతో కలిసి గుంతలు పూడ్చే పనిలో పాల్గొన్నారు. జీటీ రోడ్డులో గుంతలు ప్రమాదకరంగా మారాయని, ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగర కౌన్సిల్‌లో రోడ్డు బాగు చేయాలని తీర్మానం చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వేలాది వాహనాలు ప్రయాణించే ప్రధాన మార్గం ఈ దుస్థితిలో ఉండటం చాలా బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు.

Krithi Shetty : భరించలేకపోతున్నాను – ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి

గుంతలు పూడ్చే యంత్రం వచ్చినా దాన్ని ఉపయోగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె అన్నారు. ఆగస్టులోనే సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడం బాధాకరమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. కమిషనర్‌ను పలుమార్లు వ్యక్తిగతంగా కలసి విజ్ఞప్తులు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మా ఆఫీస్, నా ఇల్లు ఉన్న రోడ్డు కూడా బాగు చేయలేకపోతున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. అందుకే నేను స్వయంగా గుంతలు పూడ్చాల్సి వచ్చిందని ఎమ్మెల్యే మాదవి అన్నారు. అధికారులు తమ బాధ్యత నిర్వర్తించకపోవడంతో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోక తప్పడం లేదన్నారు. సమస్యకు పరిష్కారం చూపించడం లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశామని తెలిపారు. పరిస్థితి అధికమైతే ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని, అధికారులు అంతవరకు తాము వెళ్లే పరిస్థితి రాకుండా చేసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద చర్చను రేపగా, సమస్య పరిష్కారానికి ఇప్పుడు వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

NTV Special : హిట్ సినిమా తీసినా కూడా భారీ గ్యాప్ తీసుకుంటున్న టాలీవుడ్ దర్శకులు

Exit mobile version