Site icon NTV Telugu

Danam Nagender: చింతల్బస్తీలో ఎమ్మెల్యే దానం హల్చల్.. కూల్చివేత అడ్డగింత

Danam Nagendar

Danam Nagendar

హైదరాబాద్ చింతల్‌బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కూల్చివేతలను దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన వాళ్ళు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేవరకు కూల్చివేతలు ఆపాలని.. లేదంటే ఆందోళన చేస్తానంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.

Read Also: Uttam Kumar Reddy: ఏడాదిలోగా నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

అంతకుముందు హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పానని తెలిపారు. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయి.. వాటిని కూల్చుకోండన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు అని దానం నాగేందర్ తెలిపారు.

Read Also: Uttam Kumar Reddy: ఏడాదిలోగా నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

Exit mobile version