NTV Telugu Site icon

Andhra Pradesh: రోడ్డుప్రమాదం ఎమ్మెల్సీకి తీవ్రగాయాలు, పీఏ మృతి.. జానీ మాస్టర్‌ కారులో ఆస్పత్రికి ఎమ్మెల్సీ..

Road Accident

Road Accident

Andhra Pradesh: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నెల్లూరు జిల్లా కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, ఈ ప్రమాదంలో.. అక్కడిక్కడే ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పీఏ వెంకటేశ్వరరావు మృతిచెందారు.. జాతీయ రహదారి వద్ద కంటైనర్ టైర్ పగిలి సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. వెనుక నుంచి వేగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెళ్తుండగా.. కంటైనర్‌ టైర్‌ పగలడం.. సడన్‌ బ్రేక్‌ వేయడంతో.. ఆ కంటైనర్‌ను కారు వెనక నుంచి ఢీ కొట్టింది.. ఆ తర్వాత బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. అయితే, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలోకి తరలించారు.. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్‌.. ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో.. తలకి కట్టుకట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి తన మంచి మనసు చాటుకున్నారు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌.

Read Also: Aditya- L1: తుది దశకు ఆదిత్య ఎల్-1 ప్రయాణం.. 6న గమ్యస్థానానికి శాటిలైట్..