Site icon NTV Telugu

Sachin Tendulkar: భారతరత్న తిరిగి ఇచ్చేయాలంటూ సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన

Sac

Sac

MLA Bachchu Kadu protests at Sachin Tendulkar’s home: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసన చేప్టటినందుకు గానూ ఒక ఎమ్మెల్యే పాటు 22 మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ కార్యకర్తలతో కలిసి నిన్న ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన చేపట్టారు.

Also Read: Uttarpradesh: కేంద్రమంత్రి ఇంట్లో శవం..కొడుకు పైనే అనుమానం

సచిన్ టెండూల్కర్ ఆన్ లైన్ గేమింగ్ యాప్  ‘డుబియస్’ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంటూ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉంటూ భారతరత్న పొందిన సచిన్ ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం సరికాదన్నారు. ‘బ్యాటింగ్ టు బెట్టింగ్’ సచిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నందకు భారత రత్నను వెనక్కి ఇచ్చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎంతో మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అధిక వడ్డీలకు డబ్బులు అప్పు తెచ్చి మరీ దీనిలో పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు.

యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం సిగ్గుచేటని అన్నారు.ఆన్‌లైన్ గేమ్‌ను ఎండార్స్ చేస్తున్న సచిన్.. లోకల్ గేమ్ అయిన మట్కాను ఎందుకు వదిలేశారని ఎద్దేవా చేశారు కడూ. ఎంతో ఉన్నతమైన భారతరత్న అవార్డును అందుకున్న వారు ఎండార్స్‌మెంట్ల నుంచి లాభం పొందటం కోసం ఎలాంటి వాటినైనా ప్రమోట్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.  ఇలాంటి ప్రకటనల నుంచి సచిన్ తప్పుకోకుంటే గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించే ప్రతి గణేశ్ మండపం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేతో సహా 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై సెక్షన్37 (నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన), 135 (చట్టాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేసి  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

Exit mobile version