గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థుతులు అందరికీసని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని తెలిపారు. పార్టీలో సీనియర్లు ఉండగా జూనియర్ శాసన సభ్యుడు సీనియర్ శాసన సభ్యుడి దూషించే పరిస్థితి ఏంటి? అని ప్రశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నీ ఇంటికి వస్తా.. కండువా వేసి తీసుకెళ్తా అని అన్నారు కౌశిక్. నన్ను తీసుకెళ్తా అనడానికి కౌశిక్ ఏమైన రౌడివా. ప్రాంతీయ విబేధాలు తీసుకొచ్చావు కౌశిక్. నిన్న ఆంధ్రా వాళ్ళను తిట్టి.. ఈ రోజు తప్పించుకోవడానికి చూస్తున్నావ్ . గత పదేళ్ళలో కేసీఆర్ కూడా ఇలా మాట్లాడలేదు. ప్రాంతీయ విబేధాలు సృష్టించాలని అనుకుంటున్నారు. ఆంధ్రోళ్ళ పవర్.. తెలంగాణ పవర్ అంటూ మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి?. తరిమి తరిమి కొడతాం అన్నావ్.. ఇక్కడ చేత కానీ వళ్ళు ఎవరు ఉన్నారు. శేరిలింగంపల్లి ప్రజలను ఆలోచించమని అన్నావ్. శేరిలింగంపల్లి ప్రజలకు నేనేంటో తెలుసు.. అందుకే నన్ను ఇన్ని సార్లు గెలిపించారు.. పార్టీ లకు అతీతంగా అందరికీ సేవ చేస్తా.. మీరు సక్కగా ఉండి.. నాకు చెబితే వింటా..” అని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
READ MORE: Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
పది సార్లు రెచ్చగొట్టారని.. మహిళలను అవమానించారని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆరోపించారు. “వ్యక్తిగతంగా దుశించారు. అందుకే నేను స్పందించాను. హరీష్ రావు నా భాష మార్చుకోవాలని చెప్పారు. హరీష్ రావు నాకంటే సీనియర్.. అదే హరీష్ రావు ఒక ఐపీఎస్ అధికారిని లకారం పెట్టు తిట్టిన విషయం గుర్తు చేసుకోవాలి.. సీనియర్లు ఉపాధ్యాయులు లెక్క.. మీరు ఎలా నేర్పితే అలానే మాట్లాడతాం.. నా ఇంటికి వస్తా అన్నారు కౌశిక్ రెడ్డి.. రాక పోతే నేను వస్తా అని వెళ్ళాను.. అక్కడికి వెళ్ళగానే నా పై రాళ్ళు రువ్వారు.. పూల కుండీ లు విసిరారు.. నాపై దాడి చేసిన వీడియోలు కూడా ఉన్నాయి.. కానీ నేనే కొటానంటున్నారు. కౌశిక్ రెడ్డి మాటలు కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ కరెక్ట్ అంటే.. నేను మాట్లాడేది కూడా కరెక్టే.. కేసీఆర్ అంటే ఈ రోజుకీ నాకు గౌరవం ఉంది.. కౌశిక్ లాంటి చీడ పురుగులు ఉంటే నష్టపోతారని తెలియజేస్తున్నాను.. ఇలాంటి వాడి వల్లనే ఇప్పుడు అధికారం కోల్పోయారు. కౌశిక్ రెడ్డి తల్లికి చెల్లికి తేడా తెలియని వ్యక్తి..
మహిళలను కించ పరిచి మాట్లాడుతున్నారు. నోటికి అదుపు లేని వ్యక్తి నీ మీరు ఊరి మీదికి వదిలారు.. నిన్న కౌశిక్ మాట్లాడిన మాటలకి ఫాం హౌస్ నుంచి కేసీఆర్, అమెరికా నుంచి కేటీఆర్ ఫోన్ చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పారు.. అందుకే ఈ రోజు కాస్తా అదుపులో మాట్లాడారు. ఇప్పటికైనా నీ వ్యవహరం మానుకోవాలి.” అని ఎమ్మెల్యే గాంధీ ఘాటుగా స్పందించారు.