తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15శాతం గరిష్టానికి చేరుకుంది. అయితే దీనిలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇచ్చి.. మరి కొందర్ని నిష్క్రమించమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : Farhana: ‘ఫర్హానా’ నాకు చాలా స్పెషల్ మూవీ: ఐశ్వర్య రాజేశ్
పనితీరు సరిగ్గా లేని కనీసం ఇద్దరు మంత్రులను రాజీనామా చేయమని ఎంకే స్టాలిన్ చెప్పే అవకాశం ఉందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కూడా లిస్ట్ లో ఉండే అవకాశం ఉందని పలువురు నేతలు గుసగుసలాడుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుటంబంపై ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్ వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి త్యాగరాజన్‌పై వేటుపడే అవకాశం ఉందని పార్టీ నేతలు అనుకుంటున్నారు.
Also Read : Chinese Spacecraft : 276 రోజుల తర్వాత భూమిపైకి చైనీస్ అంతరిక్ష నౌక
కాగా, గతవారమే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ ఆడియో క్లిప్పింగ్స్ ను చీప్ పాలిటిక్స్ అంటూ వాటిని కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అయితే మంత్రివర్గ వ్యవస్థీకరణలో ఈసారి డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే టీ రాజా, శంకరన్ కోవిల్ వంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని పలువురు నాయకులు అనుకుంటున్నారు.
