ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించేలా అనేక చర్యలు చేపట్టామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్టలరీలు, బ్రూవరీస్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిఘా పెట్టామని, మద్యం రవాణ జరిపే వాహానాలకు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టామన్నారు ఎంకే మీనా. సేల్ పాయింట్ల వద్ద గతంలో జరిగిన అమ్మకాలకు.. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలను బేరీజు వేస్తున్నామని, 7 లక్షల మంది హోం ఓటింగుకు అర్హులైన వాళ్లున్నారన్నారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద వచ్చిన ఆరోపణలపై వివరణ తీసుకుని సీఈసీకి పంపామని ఆయన వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ నోటీసులు పంపాం.. వాళ్లు రిప్లై ఇచ్చారని, రాజీనామై చేసిన వలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా అనుమతించాలా..? వద్దా..? అనే అంశంపై సీఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు ఎంకే మీనా. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీల పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు లేకుండా చూసేలా మరిన్ని కొత్త సూచనలు చేశామని ఆయన వ్యాఖ్యానించారు.
MK Meena : ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించేలా అనేక చర్యలు చేపట్టాం

Mk Meena