Mister Middle Class Review : మిస్టర్ మిడిల్ క్లాస్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. బ్లూ.J క్రియేషన్స్ బ్యానర్ పై GK, చందు నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. అలీ, సునీల్, రఘుబాబు, బాబూమోహన్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, మురళి గౌడ్, కరుణ భూషణ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉందంటే .
కథ విషయానికొస్తే..
వెంకటరమణ(శ్రీకాంత్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడు. తన భార్య పద్మావతి(లయ), తండ్రి ఏడుకొండలు(మురళి గాడ్), చెల్లి(కరుణ), బావ(భూపాల్), పిల్లలతో కలిసి ఉంటాడు. వీళ్లంతా ఓ హోటల్ నడిపిస్తూ అది బాగా సాగినా అత్యాశకు పోయి అప్పు చేసి మరీ రెస్టారెంట్ పెట్టి లాస్ అవుతారు.చివరికి జాబ్ కూడా పోయి వేంకటేశ్వరస్వామిని తిట్టుకొని తనని చంపేయమని సెక్యూరిటీ గార్డ్ గా చేరి గుడి మెట్ల మీద నిద్రపోతాడు. దీంతో వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై బుక్ ఇచ్చి అందులో ఏం రాస్తే అదే జరుగుగుతుంది అని కొన్ని కండిషన్స్ పెడతాడు. అసలు ఆ బుక్ ఏంటి? ఆ బుక్ కి ఉన్న కండిషన్స్ ఏంటి? ఆ బుక్ తో వెంకటరమణ కష్టాలు తీరాయా? వాళ్ళ కుటుంబం జీవితం ఎలా మారింది అనేదే మిగిలిన కథ..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
సినిమా విశ్లేషణ..కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఆయన పాత స్టైల్ లోనే తెరకెక్కించారు. ఓపెనింగ్ తోనే వెంకటరమణ కష్టాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించి కాస్త ఎమోషనల్ చేస్తారు. ఆ మిడిల్ క్లాస్ కష్టాలకు కనెక్ట్ అవ్వాల్సిందే. వేంకటేశ్వరస్వామి భూమి మీదకు వచ్చే గ్రాఫిక్స్ బాగుంటాయి. ఆయన ఇచ్చే నగలతో కాసేపు కామెడీ బాగానే నడిపించారు. ఆ తర్వాత బుక్ ఇచ్చిన దగ్గర్నుంచి కథ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది.
ఆ బుక్ తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ బుక్ చేతులు మారడం, ఆ బుక్ లో రాసినవి జరగడం, మనిషి అత్యాశకు పోవడం, దేవుడి రాతనే మార్చాలని చూడటం, యముడి రావడం.. ఇలా కాస్త ఆసక్తిగా మనిషి ఆశ, అత్యాశ, ద్వేషం, బాధ, గర్వం.. లాంటి లక్షణాలు చూపిస్తూ సరదాగా సాగుతుంది. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ స్పూఫ్ బాగుంటుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కి, మిడిల్ క్లాస్ వ్యక్తులకు కనెక్ట్ అవుతుంది.సరదాగా కాసేపు ఫ్యామితో కలిసి చూడాలి అనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..శ్రీకాంత్, లయ బాగా నటించారు. రాజేంద్రప్రసాద్ మొదటిసారి చేసినా వేంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయారు. మురళీధర్ గౌడ్, అలీ, వెన్నెల కిషోర్ నవ్విస్తారు. ధనరాజ్ యముడి పాత్రలో సీరియస్ గా కనిపించి పర్వాలేదు అనిపించారు. సునీల్ చివర్లో విలన్ గా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి పర్వాలేదనిపించారు. రఘుబాబు, పృథ్వీ, కరుణా భూషణ్, భూపాల్,బాబు మోహన్, చైల్డ్ ఆర్టిస్టులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.సాంకేతిక అంశాలు. దేవుడు కనిపించి వరాలు ఇస్తే భక్తులు ఏం చేస్తారు అనే పాత కథతో కొత్త కథనంతో కామెడీ ఎమోషనల్ గా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
ఓవరాల్ : మిస్టర్ మిడిల్ క్లాస్.. సరదాగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!