తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బోటనీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పేపర్లలో తప్పులు దొర్లాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో చిన్నచిన్న తప్పులు జరిగినట్టుగా గుర్తించారు. తెలుగు మీడియం బోటనీ 13వ ప్రశ్నలో తప్పుగా వచ్చింది. తెలుగు మీడియం మ్యాథ్స్‌లో 20వ ప్రశ్నలో తప్పు రాగా.. ఇంగ్లీష్ మీడియం బోటనీ పేపర్‌లో 5వ ప్రశ్న, పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం 20వ ప్రశ్న తప్పుగా వచ్చింది. ఇంటర్ బోర్డు ఆదేశాలతో తప్పులు సరి చేసి విద్యార్థులకు సమాచారం అందించారు అధికారులు. అయితే నిన్న కూడా ఇంగ్లీష్ పేపర్‌లో 7వ ప్రశ్న తప్పుగా వచ్చిన నేపథ్యంలో.. ఆ ప్రశ్న రాసిన విద్యార్థులకు మార్కులు వేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన తప్పులను అధికారులు వెంటనే సరిదిద్దారు.
Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తప్పుల తడకలు..
- తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పేపర్లలో తప్పులు
- బోటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో చిన్నచిన్న తప్పులు
- తెలుగు మీడియం బోటనీ 13వ ప్రశ్నలో తప్పు
- తెలుగు మీడియం మ్యాథ్స్‌లో 20వ ప్రశ్నలో తప్పు.

Inter Exams