NTV Telugu Site icon

Mission Impossible 7 : ఓటీటీలోకి వచ్చేసిన అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 01 13 At 11.13.54 Am

Whatsapp Image 2024 01 13 At 11.13.54 Am

హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టామ్ క్రూజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.61 ఏళ్ల వయసులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్‌తో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు..టామ్ క్రూజ్‌ను స్టార్ హీరోగా చేసిన స్పెషల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్. 1996లో ప్రారంభమైన ఈ మూవీ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటివరకు 6 సినిమాలు వచ్చాయి. గతేడాది ఈ ఫ్రాంఛైజీలోని ఆఖరు మూవీ మిషన్ ఇంపాజిబుల్ 7 థియేటర్లలో విడుదలైంది. రెండు భాగాలుగా మిషన్ ఇంపాజిబుల్ 7 రాగా మొదటి పార్ట్ జూలై 14, 2023న విడుదలైంది. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 పేరుతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది.మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 మూవీకి సుమారు 291 మిలియన్ డాలర్స్ బడ్జెట్ అయినట్లు సమాచారం. అంటే, భారత కరెన్సీ ప్రకారం రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీని తెరకెక్కించారు. స్పై అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టించింది.

మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాకు మొత్తంగా రూ. 4721 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..అంటే, మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీతో నిర్మాతలకు దాదాపుగా రూ. 2333 కోట్ల లాభం వచ్చింది.ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో ఊహించని ట్విస్టులతో సాగే మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఇదివరకు ఎప్పుడో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. అంటే కొంత డబ్బు చెల్లించి ఒక కాల పరిమితిలో చూసే పద్ధతిలో మిషన్ ఇంపాజిబుల్ 7 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిలం, కన్నడ మరియు మలయాళ భాషలతో సహా 16 లాంగ్వెజెస్‌లో మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.