Site icon NTV Telugu

Rajanna Sirisilla: మిషన్ భగీరథ గుంతలో పడిన వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది

108

108

Rajanna Sirisilla: గుంతలో పడ్డ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద జరిగింది. మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఓ వ్యక్తి పడిపోగా.. అక్కడున్న స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన వారు అతని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఈరోజు(మంగళవారం) చోటు చేసుకుంది.

Read Also: Odisha Train Accident: 288కి చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలానికి చెందిన బాబు అనే వ్యక్తి అగ్రహారం ప్రాంతంలో చిత్తు కాగితాలు, పాత సామాన్ సేకరిస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోజు లాగా పనిలోకి వెళ్ళగా.. అగ్రహారం ఆలయం సమీపంలో మిషన్ భగీరథ గేట్ వాల్ గుంత తెరిచి ఉండడంతో అది గమనించక అందులో పడిపోయాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి.. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.

Read Also: Telangana School Education: 229 పని దినాలతో 2023-24 విద్యా సంవత్సరం

వెంటనే స్పందించిన 108 సిబ్బంది పడిపోయిన వ్యక్తిని బయటకు చాలా సేపు శ్రమించారు. మొత్తానికి ఆ వ్యక్తిని గుంతలో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఓ రోగికి వైద్యం మాత్రమే చేయాల్సిందిపోయి.. గుంతలో పడి ఉన్న అతన్ని క్షేమంగా బయటకు తీసి ప్రాణాలను కాపాడినందున108 సిబ్బందిని స్థానికులు పొగడ్తల వర్షం కురిపించారు.

Exit mobile version