Miss World 2025 : ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు హోస్టింగ్ చేసే అరుదైన గౌరవాన్ని పొందిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే 51 దేశాలకు చెందిన అందాల ప్రదినిధులు నగరానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల కంటెస్టెంట్లు ఎయిర్ పోర్టులో అడుగుపెడుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా సాంప్రదాయ వస్త్రధారణతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలుకుతోంది. ఆతిథ్య పరంగా రాష్ట్రం తన విస్తృతతను చాటుతోంది.
Amit Shah: సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి.. ఆర్మీకి అమిత్ షా ఆదేశాలు..
అధికార యంత్రాంగం, సంఘటిత సిబ్బంది రోజూ 24 గంటలూ పనిచేస్తూ వచ్చిన అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచీ వసతి కేంద్రాల వరకు వాహనాల ఏర్పాటు, భద్రతా చర్యలు, ఆతిథ్య సేవలు అన్నింటినీ అధిక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. ఇంకా మరిన్ని దేశాల నుంచి అందాల రారాణులు హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించి, హైదరాబాద్‌ను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
