Miss Universe Finalist Sienna Weir : గతేడాది మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనల్ కు చేరిన వెళ్లిన సియోన్నా వీర్ అర్ధాంతరంగా చనిపోయింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు నెల రోజులకు పైనే లైఫ్ సపోర్ట్ పై ఆసుపత్రి బెడ్ మీద గడిపింది. ప్రస్తుతం ఆమె వయసు 23. చిన్న వయసులోనే ఆమె కన్నుమూసింది. ఆమెది ఆస్ట్రేలియా. సియోన్నా వీర్ ఫ్యాషన్ మోడల్. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిస్ యూనివర్స్ ఫైనలిస్టు, ప్రముఖ మోడల్ సియోన్నా వీర్ తన స్వస్థలమైన ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో గత ఏప్రిల్ 2న గుర్రపు స్వారీ చేస్తు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు, మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ కూడా ఆమె మరణాన్ని గురువారం ధృవీకరించారు.
Read Also:RCB vs DC : ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. మరో రికార్డ్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ
మూడేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ చేస్తున్నారు సియాన. ఆమె గుర్రపు స్వారీ ప్రమాదానికి గురి అయ్యాక దాదాపు నెల రోజులపాటు లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమె లైఫ్ టైమ్ సపోర్టును తీసివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్‌మెంట్ సియెన్నా ఫొటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తు ‘‘ఎప్పటికీ మన హృదయాల్లో’’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Read Also: Telangana martyrs memorial: రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్
కాగా..2022 ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరుగా నిలిచారు. సియోన్నా సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ రిటరేచర్, సైకాలజీలో డబుల్ డిగ్రీ చేశారు. గతంతో ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా కెరీర్ ను కొనసాగించటానికి యూకే వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. నా సోదరి, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నానని ఈ రెండింటికోసం యూకే వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపారు. గుర్రపు స్వారీ చేస్తున్నానని అది లేకుండా నా జీవితాన్ని ఊహించలేనన్న ఆమె గుర్రపుస్వారీయే ఆమెప్రాణాలు కోల్పోవటానికి కారణం కావటం నిజంగా దురదృష్టకరమని ఆమె సన్నిహితులు అంటున్నారు.