NTV Telugu Site icon

Miss Shetty Mr Polishetty : థర్డ్ సింగిల్ విడుదల తేదీ ఫిక్స్ చేసిన మేకర్స్..

Whatsapp Image 2023 07 06 At 10.24.40 Am

Whatsapp Image 2023 07 06 At 10.24.40 Am

అనుష్క శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ మొదటి సినిమాతోనే  తన అందంతో, అభినయంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి..రాజమౌళి దర్శకత్వంలో రవితేజతో నటించిన విక్రమార్కుడు సినిమా ఈ అమ్మడి కెరీర్ ను మార్చేసింది. అలాగే అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్ళీ ప్రాణం పోసింది అనుష్క. అరుంధతి సినిమాలో ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ కు అందరూ ప్రశంసలు అందించారు. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.ఈ అమ్మడు నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో అనుష్క టాలీవుడ్ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఈమె తెలుగుతో పాటు తమిళ్ చిత్రాలు కూడా చేసింది. అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాతో అనుష్క పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చింది.ఇకపోతే అనుష్క చివరిగా నిశ్శబ్దం అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించింది.. ఆ మూవీ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లో జాతి రత్నాలు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తూ ఉండగా … ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ ని ఆగస్టు 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఈ సినిమాలోని మూడవ సాంగ్ అయిన “లేడీ లక్” పాటను జూలై 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.