Miss Shetty Mr Polishetty : థర్డ్ సింగిల్ విడుదల తేదీ ఫిక్స్ చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుష్క శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి..రాజమౌళి దర్శకత్వంలో రవితేజతో నటించిన విక్రమార్కుడు సినిమా ఈ అమ్మడి కెరీర్ ను మార్చేసింది. అలాగే అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్ళీ ప్రాణం పోసింది అనుష్క. అరుంధతి సినిమాలో ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ కు అందరూ ప్రశంసలు అందించారు. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.ఈ అమ్మడు నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో అనుష్క టాలీవుడ్ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఈమె తెలుగుతో పాటు తమిళ్ చిత్రాలు కూడా చేసింది. అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాతో అనుష్క పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చింది.ఇకపోతే అనుష్క చివరిగా నిశ్శబ్దం అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించింది.. ఆ మూవీ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లో జాతి రత్నాలు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తూ ఉండగా … ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ ని ఆగస్టు 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఈ సినిమాలోని మూడవ సాంగ్ అయిన “లేడీ లక్” పాటను జూలై 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!