NTV Telugu Site icon

Misbah Ul Haq: పీసీబీ నిర్ణయం సిగ్గుచేటు: మాజీ ప్లేయర్ విమర్శలు

Misbah

Misbah

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే ఆ దేశ మాజీ ప్లేయర్లు ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రస్తుతం పాక్ కొత్త కోచ్ కోసం చూస్తున్న వెతుకుతోంది. గతంలో టీమ్‌కు కోచ్‌గా ఉన్న మిక్కీ ఆర్థర్‌నే మరోసారి తీసుకురావాలని బోర్డు ఛైర్మన్ నజామ్ సేతీ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే డెర్బీషైర్ కోచ్‌గా ఉన్న ఆర్థర్.. పూర్తిస్థాయిలో పాక్‌కు రాకుండా ఆన్ లైన్ కోచింగ్ వరకూ ఓకే అంటున్నాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల సమయంలోనే నేరుగా టీమ్‌తో కలుస్తానని చెబుతున్నాడు. అయినా సరే పీసీబీ అతనికే కోచింగ్ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అయిన మిస్బావుల్ హక్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇది పాక్ క్రికెట్‌కు చెంప పెట్టులాంటిదని అతడు అన్నాడు. ఓ హై ప్రొఫైల్ ఫుల్ టైమ్ కోచ్ కూడా మీకు దొరకడం లేదా అని మిస్బా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: Formula E: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ రేసింగ్.. ఎన్‌టీఆర్‌ మార్గ్ పూర్తిగా క్లోజ్

“మన క్రికెట్ వ్యవస్థకు ఇది చెంప పెట్టులాంటిది. మనం కనీసం ఓ హై ప్రొఫైల్ ఫుల్ టైమ్ కోచ్‌ను కనుగొనలేకపోతున్నాం. మంచి కోచ్‌లు రావడానికి ఆసక్తి చూపకపోవడం, పాక్‌ను రెండో ఆప్షన్‌గా చూస్తున్న వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలనుకోవడం సిగ్గు చేటు. దీనికి మన వ్యవస్థే కారణం. ఇందులో చాలా బలహీనతలు ఉన్నాయి. మన సొంత వ్యక్తులనే అగౌరవపరిచినందుకు మనల్ని మనం నిందించుకోవాలి. ఇప్పటి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు పడదు. మాజీలు తమ రేటింగ్స్ కోసం యూట్యూబ్ ఛానెల్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇది మన క్రికెట్ విశ్వసనీయతను దెబ్బతీసి, మనం అసమర్థులం అన్న ముద్ర వేసేలా చేస్తోంది. దేశంలో క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది. కానీ ఎప్పుడూ సరైన కారణాలతో వార్తల్లో నిలవడం లేదు. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ క్రికెటర్లు సహచర క్రికెటర్లను నేషనల్ ఛానెళ్లలో తిడుతున్నారు. ఇది ఫ్యాన్స్‌కు తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. అసలు గౌరవమే లేదు” అని మిస్బా ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: INDvsAUS Test: స్టార్ ఆసీస్ ప్లేయర్ వీసా ఆలస్యం..క్రికెటర్ అసహనం

Show comments