NTV Telugu Site icon

Mirzapur 3 : మీర్జాపుర్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్..?

Whatsapp Image 2023 11 16 At 12.10.17 Pm

Whatsapp Image 2023 11 16 At 12.10.17 Pm

ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్‌ అండ్ థ్రిల్లర్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్ లు తెగ నచ్చేస్తుంటాయి..అలాంటి జోనర్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’..పంక్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌ మరియు శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ను కరణ్‌ అన్షుమన్‌ మరియు గుర్మీత్‌ సింగ్‌లు తెరకెక్కించారు.ఇప్పటికే ‘మీర్జాపూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 విడుదల అయి రికార్డు స్థాయి లో వ్యూవర్ షిప్ సాధించాయి… దీంతో ఓటీటీ లో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍ గా మీర్జాపూర్ నిలిచింది.మీర్జాపూర్‌ తొలి సీజన్‌ 2018 నవంబరు 16 న విడుదలైంది.మొదటి సీజన్‌ కు అద్భుత స్పందన లభించింది. దానికి కొనసాగింపు గా 2020 అక్టోబరు 23 న రెండో సీజన్‌ కూడా విడుదలైంది.. రెండవ సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.అయితే, మీర్జాపూర్ 3 వ సీజన్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. దానిపై తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చింది. ‘మీర్జాపూర్‌ సీజన్ 3’ ఓటిటి రిలీజ్ డేట్ త్వరలోనే తెలియజేయనున్నట్లు అమేజాన్ ప్రకటించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుక గా …ఈ సీరిస్ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఈ వార్త బాలీవుడ్ మీడియా లో బాగా ప్రచారం జరుగుతోంది. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు..తొలి సీజన్‌ లో గుడ్డు(అలీ ఫజల్‌) తన తమ్ముడు బబ్లూ(విక్రాంత్‌), భార్య శ్వేత(శ్రియ పిల్గోంకర్‌)లను మున్నా(దివ్యేందు శర్మ) ఎలా నాశనం చేశాడన్న కథ తో సాగింది. రెండో సీజన్ లో గుడ్డు తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడన్న దాన్ని ఈ సిరీస్‌ లో చూపించారు.ఈ సిరీస్‌ ను గుర్మీత్‌ సింగ్‌, మిహిర్‌ దేశాయ్‌ లు తెరకెక్కించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రితేశ్‌ సిద్వానీ నిర్మించారు.

Show comments