Mirzapur Folk Singer Saroj Sargam Arrested: హిందూ దేవీ, దేవతలను కించపరుస్తూ మాట్లాడటం, పాటులు పాడటం సర్వసాధారణంగా మారుతోంది. తాజాగా దేశం మొత్తం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. దుర్గాదేవిని జగన్మాతగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కి చెందిన సరోజ్ సర్గం అనే ఫోక్ సింగర్ మాత్రం దుర్గామాతను కించపరుస్తూ పాట పాడింది. తన పాటలో విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా.. ప్రహ్లాదుడిని తాగుబోతుగా ఆమె అభివర్ణించింది. ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ ఫిర్యాదు ఆధారంగా మదిహాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ కావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సహ నిందితుడైన సరోజ్ సర్గం భర్త రామిలన్ బింద్‌లతో పాటు బిర్హా బృందంలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. ఈ వీడియోను గాయని భర్త రామిలన్ బింద్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
READ MORE: Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!
అయితే.. తాజాగా ఈ ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిపై అనేక కేసులు నమోదయ్యాయినట్లు పోలీసులు చెబుతున్నారు. మార్చి 23, 2025న నగర కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో గాయని, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. సరోజ్ సర్గంపై మీర్జాపూర్‌తో పాటు మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. బిర్హా బృందాన్ని గాయకుడు సరోజ్ సర్గం భర్త రాంమిలన్ బింద్ నిర్వహిస్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ బర్మా తెలిపారు. ఈ గాయని గత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలుగా పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) కమ్యూనిటీలపై పాటలు పాడుతున్నారు. కానీ.. తాజాగా వివాదం సృష్టించిన పాటను రచయిత రాజ్‌వీర్ సింగ్ యాదవ్ ఆదేశం మేరకు తాను కంపోజ్ చేశానని వెల్లడించింది. తన “బహుజన్ నాయక్ మహిషాసుర్” పుస్తకంపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు గెలిచానని రాజ్‌వీర్ స్వయంగా ఆమెకు చెప్పాడట. కాబట్టి.. తాను భయపడాల్సిన పని లేదని.. ఈ పుస్తకం నుంచే ఈ పాట కంటెంట్‌ను తీసుకున్నట్లు నిందితురాలు తెలిపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సూత్రధారి రాజ్‌వీర్ సింగ్ యాదవ్ కోసం వెతుకుతున్నారు.
