Mirpet Madhavi Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్యకేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి కోర్టులో రోజు వారి ట్రైల్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 36 మంది సాక్షులను పోలీసులు పేర్కొన్నారు. 20 మంది సాక్షుల విచారణ పూర్తి చేశారు. ట్రైల్ సందర్భంగా మరో సంచలన విషయం బయట బయటపడింది. నిందితుడు గురుమూర్తికి మరదలుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ ఎఫైర్ కారణంగానే తరచూ గురుమూర్తి – మాధవి మధ్య గొడవలు జరిగేవని తెలిసింది. ఇదే విషయంపై పలు మార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి తీరు మారలేదు. మళ్ళీ అదే విషయంపై గొడవ పడటంతో మాధవిని హత్య చేశాడు గురుమూర్తి.. ఈ ఏడాది జనవరి లో మాధవిని ముక్కలు ముక్కలు చేసి హత్య ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు.
READ MORE: Story Board: చంద్రబాబు మాటలకు అర్థమేంటి..? ఏడాదిన్నరకే కూటమి చేతులెత్తేసిందా..?
అసలు కథేంటి?
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేశాడు. మరదలుతో విహాతర బంధం పెట్టుకున్న గురుమూర్తి భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశాడు. మాధవి శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు. మాధవి డీఎన్ఏ.. తల్లి, పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫోరెన్సి్క్ అధికారులు తేల్చారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజు భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడవేసినట్లు తేల్చారు.
