ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో వచ్చాయి మిరాయ్.
Read : Manchu Bonding : కరుగుతున్న ‘మంచు’.. మనోజ్ సినిమాకు విష్ణు స్పెషల్ విషెష్
ఇక రెండవ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ దెయ్యంలా కనిపించబోతున్న ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. రెండు సినిమాలు ప్రీమియర్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాబట్టాయి. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎక్కువ మార్కులు అంటే.. కిష్కింధపురి హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమా అందుకు తగ్గట్టే ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. కథ, కథనం అన్ని చక్కాగా కుదిరాయి. మ్యూజిక్, విజువల్స్ మెప్పిస్తాయి. లీడ్ రోల్స్ పర్ఫామెన్స్ సూపర్బ్. ఇక మిరాయ్ చూసుకుంటే మైథలాజికల్ టచ్ తో టెక్నికల్ గా విజువల్ వండర్ గా అనిపించింది. కథ బాగున్నా కధనం కాస్త నెమ్మదించింది. ఇకఈ రెండు సినిమాలలో విన్నర్ అంటే హారర్ జానర్ ఇష్టపడే వారికీ కిష్కింధ సూపర్బ్ గా ఉంటుంది. మైథాలజీకల్ ఆడియెన్స్ కు మిరాయ్ అదురుతుంది. ఓవరాల్ గా ఈ వారం రెండు సినిమాలు విజేతలుగా నిలిచాయి. రెండు ఫ్యామిలీతో కలిసి చూసే మంచి సినిమాలు.
