Site icon NTV Telugu

Mirai Collections: బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న ‘మిరాయ్‌’ కలెక్షన్స్..!

Mirai

Mirai

Mirai Collections: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా, ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 112.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా తెలియజేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

IPhone 17 Blinkit: కేవలం 30 నిమిషాల్లో మీ చేతిలోకి ఐఫోన్ 17.. ఎలా అంటే?

అయితే, ఈ నెల 25వ తేదీ వరకు అంటే మరో వరం రోజులపాటు మరొక పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం కూడా ‘మిరాయ్’కు కలిసి వచ్చే అంశమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతి బాబు, జయరాం వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అశోకుడు రాసిన 9 గ్రంథాల కథాంశంతో.. ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దారు. మొత్తానికి “మిరాయ్” తేజ సజ్జా కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.

Anshu Malika: పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!

Exit mobile version