Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mirai Blockbuster Success Hari Gowra Press Meet Teja Sajja

Gowra Hari : ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది..జ్వరంతో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళా !

Published Date :September 15, 2025 , 6:53 pm
By Bhargav Chaganti
Gowra Hari : ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది..జ్వరంతో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళా !
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

హనుమాన్, మిరాయ్ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు.. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
– చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు సినిమా కోసం పడ్డ కష్టం మర్చిపోతాం. మా నిర్మాత, దర్శకుడు, హీరో, టీమ్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.

– కార్తీక్ గారు చాలా అద్భుతమైన పిక్చర్ తీశారు. ఆ పిక్చర్ నన్ను మ్యూజిక్ ఇవ్వడానికి ఇన్‌స్పైర్ చేసింది. సినిమా చూస్తున్నప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి దగ్గరగా ఉందనిపించింది.

ఈ సినిమా కోసం మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
– చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. అందరికీ మ్యూజిక్ చాలా నచ్చింది. ఆడియన్స్ థియేటర్‌లో గ్రేట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జ్వరంతో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళా.

మీకు ఈ సినిమాలో మ్యూజిక్ చేయడానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిన క్యారెక్టర్ ఏమిటి?
– ప్రతి పాత్రకి వెయిటేజ్ ఉంది. ప్రతి పాత్ర గొప్ప మ్యూజిక్ ఇవ్వడానికి ఇన్‌స్పైర్ చేసింది.

– ఇందులో మిరాయ్ ఆయుధానికి లార్డ్ శివ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బిజి) ఉపయోగించడం జరిగింది. శ్రీ రాములవారి ఆయుధం అయినప్పటికీ దానికి పినాక అనే పేరు ఉంది. ఆస్ఫూర్తితో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయడం జరిగింది.

– స్టోరీని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్కోర్ కూడా రాయడం జరిగింది. ఈ సినిమా రాములవారి పోర్షన్ చేయడానికి దాదాపు 10 డేస్ పట్టింది. అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడానికి టైమ్ పట్టింది.

– ఈ సినిమా కోసం రకరకాల జానర్స్‌ని వాడడం జరిగింది. ఇంటర్వల్ బ్యాంగ్‌లో నాలుగు జానర్స్‌లో సౌండ్‌ని మిక్స్ చేసి ప్రెజెంట్ చేసే అవకాశం రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది

వైబ్ వుంది సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.. అది సినిమాలో లేకపోవడం మిమ్మల్ని నిరాశపరిచిందా?

– లేదు. అది అంతా టీమ్ డెసిషన్. సినిమాకి ఏది అవసరమో అది చేయడమే కరెక్ట్. మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయం అది.

– నిజానికి చాలా పెద్ద కథ ఇది. ఒక పార్ట్‌గా చెప్పడం చాలా చాలెంజ్. కానీ కార్తీక్ గారు చాలా అద్భుతంగా సినిమాని ప్రెజెంట్ చేశారు. ఆ సాంగ్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసుకుంటే ఫ్లోకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది. దీంతో ఆ నిర్ణయం తీసుకున్నాం.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని కీరవాణి గారితో పోల్చుతూ కొన్ని కాంప్లిమెంట్స్ వినిపించడం ఎలా అనిపించింది?
– కీరవాణి గారు లాంటి లెజెండరీ కంపోజర్‌తో పోల్చడం నాకు ఒక భయాన్ని తీసుకొస్తుంది. భవిష్యత్తులో తెలిసో తెలియక ఏదో ఒక చిన్న తప్పు చేసిన అది నాకు పెద్ద అపవాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆయనతో పోల్చడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ అదే సమయంలో భయాన్ని కూడా ఇస్తుంది.

మీ జర్నీ ఇప్పటివరకు ఎలా అనిపించింది?
– నమ్మకాన్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో చాలా టైమ్ పట్టింది. కన్నడలో చార్మినార్‌తో మంచి హిట్ వచ్చింది. అయితే తెలుగులో ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన అలంటి సినిమాలు చేశాను.

– ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ పూలమ్మె పిల్ల సాంగ్ ఇచ్చాను. ఆయనకి నచ్చింది. తర్వాత ఆయన సినిమా చూపించారు. నేను చేసిన స్కోర్ చాలా నచ్చింది. ఆ సినిమా విజయం గొప్ప నమ్మకాన్ని ఇచ్చింది.

– తేజ గారు మళ్లీ మిరాయ్ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ మొత్తం జర్నీలో మెల్లమెల్లగా నమ్మకాన్ని బిల్డ్ చేసుకుని రావడం ఆనందాన్ని ఇచ్చింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి?
– పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..

  • Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Peddi : ‘పెద్ది’ షూట్ కంప్లీట్ కావడానికి ముహూర్తం ఫిక్స్!

  • CM Chandrababu Naidu: తమిళనాడుకు ఉజ్వల భవిష్యత్ కావాలంటే ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించండి.. సీఎం విజ్ఞప్తి..

ట్రెండింగ్‌

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions