NTV Telugu Site icon

Minister Seethakka : ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నాం

Minister Seethakka

Minister Seethakka

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుని బ్రతుకుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీవితాంతం కెసిఆర్ కుటుంబమే పరిపాలిస్తుందని బిఆర్ఎస్ నాయకులు భ్రమల్లో బతికారని, రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామికంగా ఆలోచించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారన్నారు. ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుండే కూల్చేస్తాం,కూలగొడతామంటూ అంటూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ వల్ల మాటలు నచ్చక వారి ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను టిఆర్ఎస్ లో కలుపుకొని ఇతర పార్టీలను లేకుండా చేయాలనుకున్నారని ఆమె మండిపడ్డారు. 10 ఏళ్లు ఇష్టరాజ్యంగా అధికారం అనుభవిస్తూ రాష్ట్రాన్ని తమ ఎస్టేట్ గా చేసుకోవాలనుకున్నారని, ప్రశ్నించే నాయకుల ఫోన్లు టాపింగ్ చేపించి,పోలీస్ వ్యవస్థను వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

China: చైనా దేనికి భయపడుతుంది? ప్రతి విద్యార్థికి సైనిక శిక్షణ ఇచ్చేలా చట్టం!

అంతేకాకుండా..’ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం ప్రజాస్వామికంగా పనిచేస్తుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై టిఆర్ఎస్ నాయకులు చిందులు వేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తొస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేకు కండువా కప్పి వెంటనే మంత్రి పదవులు ఇచ్చారు. నేడు బిఆర్ఎస్ వాళ్లు పార్టీ మారితే లేనిపోని ఆరోపణలు చేస్తూన్నారు. ప్రజాస్వామ్యక బద్ధంగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను మేం అధికారంలోకి వచ్చాక మీ అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు హైదరాబాద్ లో గాని ,రాష్ట్రంలో గాని అల్లర్లు సృష్టించు బిఆర్ఎస్ తప్ప రాష్ట్రాన్ని ఎవరు పాలించాలేరు అనే అపోహలో కలిగించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో జరిగేవి దొరల అభద్రత,దురాహంకారంతో జరిగే అల్లర్లు. ఆంధ్ర,తెలంగాణా అనే సెంటిమెంట్ రాజకీయాలకి తెరలేపారరు. మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు అరికాళ్ళకు ముళ్ళు గుచ్చితే నోటి పంటితో తీస్తానన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే విషయం గుర్తుకు రాలేదా. కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరుకకా బ్రతికిన పోయిన హరీష్ రావు పదేళ్లు తెలంగాణలో మంత్రి పదవి అనుభవించారు. అమరుల త్యాగాలను చెప్పుకుంటూ 10 ఏళ్ళు పదవులు అనుభవించింది బీఆర్ఎస్ వాళ్ళు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ,సెంటిమెంటు సృష్టిస్తూ అధికారంలో కి వస్తాం అనే భ్రమలో బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మహిళకు ఫ్రీ బస్సు,ఉచిత కరెంట్ విషయంలో అనేక దుష్ప్రచారాలు సృష్టిస్తున్నారు. ఇతర పార్టీలో నుంచి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనడం హాస్యాస్పదంగా ఉంది.’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

Forgotten Items In Hotels: హోటల్స్‌లో ఎక్కువ మంది మరిచిపోయే వస్తువులు ఇవే..

Show comments