Minor Girl Gang R*pe: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పరిచయాలు చివరికి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని చివరకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా గురుగ్రామ్ లో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే..
Gorakpur: ఎవర్రా మీరంతా….. 15 ఏళ్ల బాలుడిపై.. అమ్మాయి అత్యాచారం..
రెండు రోజుల క్రితం సాయంత్రం సమయంలో ట్యూషన్ కి వెళ్తున్న సమయంలో లక్ష్య, అనిత్ అనే ఇద్దరు నిందితులు మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించారు. టూషన్ వద్ద తనని వదిలేస్తామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ట్యూషన్ వద్ద దింపకుండా ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలికను ఆమె ఇంటి సమీపంలో కారులో నుంచి తోసేశారు. అయితే, సాయంత్రం నాలుగున్నర గంటలకు ట్యూషన్ కి వెళ్లే తన అమ్మాయి ప్రతిరోజు ఆరున్నర గంటలకు ఇంటికి వచ్చేది. అయితే ఆ సమయానికి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికను వెతకడం మొదలుపెట్టారు.
Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్‌కు ఇదేం పైత్యం..
ఈ సమయంలో వారు అమ్మాయి ట్యూషన్ కి వెళ్ళలేదని తెలుసుకున్నారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో తన కూతురు ఇంటికి ఏడుస్తూ వచ్చి జరిగిన సంఘటనను వివరించిందని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సొ చట్టం తోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సీనియర్ పోలీసు అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధితురాలి వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఇద్దరి నిందితులను అదే రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.