Site icon NTV Telugu

Earthquake: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం

Vikarabad

Vikarabad

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓ వైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Exit mobile version