NTV Telugu Site icon

Journalists Health Camp; జర్నలిస్ట్ హెల్త్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి

Health 1

Health 1

విధి నిర్వహణలో ఎన్నో వత్తిడులకు, వివిధ అనారోగ్య సమస్యలకు గురయ్యే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణకు ఏపీ ప్రభుత్వం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. జర్నలిస్టులకు హెల్త్ క్యాంపు ప్రారంభించారు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజని. లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో జర్నలిస్టులకు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు పూర్తి స్ధాయి వైద్య పరీక్షలకు ఏర్పాటు చేశారు. జర్నలిస్టులకు కుటుంబ సమేతంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరగనుంది హెల్త్ క్యాంప్. 11 ఆసుపత్రుల నుంచీ 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు.

Read Also: Korutla Trans co: కోరుట్ల ట్రాన్స్ కో ఉద్యోగులు దాడి.. పోలీస్టేషన్‌ కు చేరిన నీటి తంట

రెండవ రోజు వైద్యుల కన్సల్టేషన్ కు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. 47 నెలల పాలనలో సీఎం జగన్ 2.10 లక్షల కోట్లు డిబిటి ద్వారా ఇచ్చారు. జర్నలిస్టులు అనేక ఒత్తిడుల మధ్య పని చేస్తారు. జర్నలిస్టుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేశామన్నారు. జర్నలిస్టు హెల్త్ స్కీం లో 1250 రూపాయలతో హెల్త్ కార్డు ఇస్తున్నామన్నారు. జర్నలిస్టులు అందరూ ఈ హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు కమిషనర్ ఐ అండ్ పీఆర్ విజయ్ కుమార్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవాలంటే ఇన్స్యూరెన్స్ తప్పనిసరి. ఆరోగ్య శ్రీ మీద రూ.3300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. EHS కి సమానంగా జర్నలిస్టు హెల్త్ స్కీం అమలు చేస్తున్నామన్నారు. కుటుంబం మొత్తం కవర్ అయ్యేలా ఇచ్చిన జర్నలిస్టు హెల్త్ స్కీం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు కృష్ణబాబు. 5.3కోట్ల ఆంధ్రుల హెల్త్ రికార్డు ఫ్యామిలీ డాక్టర్ స్కీంలో పెట్టాం అన్నారు. ఈ క్యాంపులో మెమోగ్రామ్ ను భయం లేకుండా చేయించుకోవాలన్నారు.

మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం రోజు చాలామంది జర్నలిస్టులు హెల్త్ క్యాంపు పెట్టాలని కోరారు. హెల్త్ క్యాంపులో ఒకొక్కరికీ పదివేల రూపాయల ఖర్చుతో మొత్తం టెస్టులు చేస్తారన్నారు. జర్నలిస్టులకు ఏ వైద్య సహాయం అవసరమైనా మా కార్యాలయానికి వచ్చి సంప్రదించవచ్చు. సీఎం జగన్ ఇలాంటి కార్యక్రమాలకు ముందుంటారు. జర్నలిస్టు వృత్తి కత్తిమీద సాములాంటిది. సీఎం జగన్ చేసే సంస్కరణలు, సంక్షేమాలు ప్రజలకు చేర్చేది జర్నలిస్టులు. ఎన్ని కష్టాలు ఉన్నా జర్నలిస్టులు విలువల కోసం పని చేస్తున్నారు.జర్నలిస్టులు నిజాన్ని, మంచిని చూపిస్తారని నమ్ముతున్నాను అన్నారు మంత్రి విడదల రజని. ఇక్కడ టెస్టులు, కన్సల్టెన్సీ అనంతరం తదుపరి వైద్యం కూడా చేయిస్తాం. గ్రామస్ధాయిలోనే వారి ముంగిటిలోనే వైద్యం అందేలా ఫ్యామిలీ డాక్టర్ స్కీం ఏర్పాటుచేశాం అన్నారు. 17 మెడికల్ కాలేజీలలో 5 మెడికల్ కాలేజీలకు క్లియరెన్స్ వచ్చిందని మంత్రి తెలిపారు.

సమాచార శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సమాజ చైతన్యం కోసం నిత్యం పని చేస్తూ అనేక ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు జర్నలిస్టులు.వైద్యరంగం లో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన మహానీయుడు రాజశేఖరరెడ్డి. అందరికీ వైద్యం అందించాలన్నది ఆరోగ్యశ్రీ లక్ష్యం. సమస్యల వలయంలో చిక్కుకున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు, నాలుగు హెల్త్ క్యాంపు లు ఏర్పాటు చేస్తాం. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి లలో ఈ హెల్త్ క్యాంపులు వుంటాయన్నారు. ఈ హెల్త్ క్యాంపు ను జర్నలిస్టులు సద్వినియోగ పరచుకోవాలని మంత్రి వేణుగోపాల్ సూచించారు.

Read Also:Korutla Trans co: కోరుట్ల ట్రాన్స్ కో ఉద్యోగులు దాడి.. పోలీస్టేషన్‌ కు చేరిన నీటి తంట

Show comments