తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియదు.. నేను అడిగిన వాటికి సీఎం క్లారిటీ ఇవ్వాలి అని అన్నారు. గంగులు వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ఆకారాలు పెద్దగ ఉంటే..అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అవగాహన లేదు అంటున్నారు.. ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా.. మంత్రికి అవగాహన లేదని మాట్లాడటం పొరపాటు.. గంగుల వ్యాఖ్యలను వెనక్కి తీసీుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:Jailer 2 : జైలర్ 2’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
దీనికి బదులుగా గంగుల మాట్లాడుతూ.. నేను బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది. ముఖ్యమంత్రి సభలో ఉన్నారు. నేను తప్పు మాట్లాడలేదు.. అతనికి అవగాహన లేదని ఎందుకు అన్నానంటే..అని చెప్పబోతుండగా.. ముఖ్యమైన బిల్లుపై చర్చ జరుగుతుంటే చిన్న చిన్న అంశాలను పట్టుకుని రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు శ్రీధర్ బాబు. మంత్రిని ఉద్దేశించి అవగాహన లేదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రిని.. బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరుగుతుంటే ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సభా సంప్రదాయాలకు విరుద్దంగా మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. గంగుల కమలాకర్ గతంలో మంత్రిగా పనిచేశారు. బలహీన వర్గాలు పడుతున్న బాధ ఏంటో ఆయనకు తెలుసు. చారిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని కోరారు.
Also Read:NBK : వాళ్లు లేకుంటే నేను లేను.. ఈ రికార్డులు.. అవార్డులకు వాళ్లే కారణం : నందమూరి బాలకృష్ణ
స్పీకర్ మాట్లాడుతూ.. రెండో సారీ మంత్రి అప్పీల్ చేశారు.. పొన్నంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని గుంగులకు సూచించారు. మా హక్కులనున కాపాడండి అని గంగుల స్పీకర్ ను కోరారు. మాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.. అంతరాయం కలగకుండా చూసే బాధ్యత మీదే అని తెలిపారు. దీంతో స్పీకర్ మాట్లాడుతూ మీ హక్కులు కాపాడతాం.. కానీ మిమ్మల్ని తిట్టించుకునే మాటలు మాట్లాడకండి అని అన్నారు. పర్సనల్ గా మాట్లాడొద్దు అని చెప్పండి మంత్రులకు అని గంగుల అనడంతో ఆ అవకాశం ఇవ్వకండి మీరు అని స్పీకర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
