Gudivada Amarnath: తాజాగా వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్రికా సమావేశంపై స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మాట్లాడిన వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని, వాటిని తట్టుకోలేక అధికార పక్ష మంత్రులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని ఆయన సీఎంపై పరోక్షంగా విమర్శించారు. గూగుల్‌ను స్వాగతిస్తున్నామని తాము చెప్పినప్పటికీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందని అమర్నాథ్ అన్నారు. గూగుల్-రైడెన్ సంస్థతో ఒప్పందంలో ఉద్యోగాల గురించి జగన్ ప్రశ్నించారని, అలాగే గూగుల్-అదానీ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో జరిగిన చర్చలను ఆయన వివరించారని తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో అదానీ పేరు చెప్పడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని, అదానీ పేరు చెప్తే జగన్‌కు మంచి పేరు వస్తుందనేది వారి బాధ అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
Redmi Projector 4 Pro: రెడ్‌మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!
లక్షా 80 వేల ఉద్యోగాలు ఎలా వస్తాయో క్లారిటీ ఇవ్వాలని, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాల కల్పన అవుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. క్రెడిట్ కొట్టేయాలని తండ్రీ కొడుకులు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎల్లో మీడియా రోజూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంటోందని, “సినిమా టైటిల్ వేరు, ఎల్లో మీడియా స్టోరీ ఒక్కటే” అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి చూపించాలని ఆయన సవాల్ చేశారు.
మరోవైపు భూమి సమీకరణ చేయకుండానే చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారని అమర్నాథ్ గుర్తు చేశారు. 2,700 ఎకరాలకు కేవలం 350 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంటే, తాము మొత్తం భూమి సేకరణ పూర్తి చేశామని తెలిపారు. నాలుగు గ్రామాలను తరలించి భోగాపురం ఎయిర్‌పోర్టు స్థలానికి గోడ నిర్మించి, ఎటువంటి చిక్కులూ లేకుండా జీఎంఆర్ (GMR)కు స్థలం అప్పగించామని వివరించారు. రామాయపట్నం పోర్టును కూడా తామే కట్టామని ఆయన పేర్కొన్నారు.
Liquor Shop Licence: మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే?
ఏ పనీ చేయకపోయినా శిలాఫలకాలు వేసుకోవడంలో బాబు సిద్ధహస్తుడని విమర్శించిన ఆయన, 21 సంవత్సరాల ముందే బాబుకి హైదరాబాద్‌తో సంబంధం లేదని అన్నారు. బాబు, లోకేష్ ఒక యాడ్ ఏజెన్సీని నడుపుతున్నారని ఆరోపించారు. జగన్ చేసిన మంచిని ఎలాగో చెప్పరు, కనీసం అదానీ పేరు అయినా చెప్పండి అని కోరారు. చివరిగా.. చంద్రబాబు శిలాఫలకాలు అన్నీ సమాధి రాళ్లుగా మిగిలిపోతాయని గుడివాడ అమర్నాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
