NTV Telugu Site icon

Vidadala Rajini: చంద్రబాబు కుట్రలో భాగమే ఈ అమరావతి రైతుల యాత్ర..

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: విశాఖలోని కింగ్ జార్జ్‌ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ వయసులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయలేరని.. లోకేష్ పాదయాత్ర చేసిన జనం విశ్వసించరన్నారు. అందుకే అమరావతి రైతుల పేరిట చంద్రబాబు నాయుడు పరోక్షంగా పాదయాత్ర చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Thammineni Seetharam: మూడు రాజధానులతో చంద్రబాబుకు వచ్చిన సమస్య ఏంటి?

అమరావతి రైతుల పేరిట జరిగే పాదయాత్రలో పరిణామాలకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. అమరావతి ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి విద్వేషాలు లేవని… అందరూ తెలుగువారేనన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే ఈ అమరావతి రైతుల యాత్ర అంటూ రజనీ ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖ, కర్నూలు, అమరావతిలను సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానులుగా గుర్తించారని మంత్రి స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు వెళుతుందని మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు.