ఈ నెల 21 నుంచి కుల గణన ప్రారంభం అవుతుంది అని సమాచార శాఖ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుంది.. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్ల సర్వే ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయంతో బీసీ వర్గ వ్యక్తిగా చాలా ఆనందంగా ఉంది అని మంత్రి అన్నారు. కుల గణన వల్ల వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.. దీని వల్ల ఈ వర్గాల అభ్యున్నతికి ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది అని చెల్లుబోయిన వేణు తెలిపారు.
Read Also: IPL: ఐపీఎల్‌పై సౌదీ అరేబియా కన్ను.. భారీ పెట్టుబడికి సిద్ధం..
రిషి కొండపై ఏర్పాటు చేస్తున్నది ముఖ్యమంత్రి పర్యటన సమయంలో తాత్కాలిక విడిది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజకీయ కారణాలతోనే కొంత మంది సుప్రీం కోర్టుకు వెళ్ళారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఏపీలో మరోసారి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యనించారు.