మంత్రివర్గంలో సమర్ధుడైన వ్యక్తి కావడం వల్లనే భట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కరెంట్ సమస్య కూడా చాలా క్లిష్టమైనది.. ఈ రెండు కష్టమైన కిరీటాలు భట్టికి అప్పగించారని తుమ్మల తెలిపారు. భట్టి విక్రమార్క పనితీరును వల్లనే ఆయనకి ఆ పదవులు ఇచ్చారని.. ఆయన అద్భుతంగా ఆ పదవిని నిర్వహిస్తారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎటువంటి అక్రమాలు లేకుండా కబ్జాలు లేకుండా చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు విక్రమార్క, పొంగులేటి సహకారంతో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లా ప్రజలకి తాగునీరు పూర్తిగా కల్పించేలా కృషి చేస్తానని తుమ్మలన్నారు.
Laxman: కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అవినీతి దోపిడీకి గ్యారెంటీ
కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు పథకాలను అమలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్ లను అమలు చేశామని పేర్కొన్నారు. మిగతా హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. తల తాకట్టు పెట్టి ఐనా హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఖమ్మం ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా ఋణం తీర్చుకోలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్ళని.. భట్టి విక్రమార్క మళ్ళీ తనకు 5 ఏళ్ళు ఇచ్చారని తెలిపారు. గతంలో కొందరు తలమాసిన వ్యక్తుల వలన తప్పులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు, ఆక్రమణలు ఉంటే వాటిని సరి చేసుకోవాలని సూచించారు. సీపీ, కలెక్టర్ తెలంగాణలోనే ఉంటారని ప్రజల కోసం పని చేయాలని మంత్రి తెలిపారు.
Balineni Srinivasa Reddy: సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం..
