NTV Telugu Site icon

Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తాం..

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెసల కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోళ్లు పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు గిట్టుబాటుకు అమ్ముకోవడంలో మార్కెట్ లో సౌకర్యాలు ఉండాలన్నారు. రైతులు ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సూచించారు.

సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద చేపడుతున్న సాగర్ కాల్వ మరమ్మతులను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలువ మరమ్మతుల్లో జాప్యం, అధికారుల మధ్య సమన్వయ లోపంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతుల పురోగతిపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KTR Tweet: అనుముల తిరుపతి రెడ్డి గారు!.. ఆ కిటుకేదో చెప్పండి..