మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తలపడాలి కానీ.. భౌతిక దాడులకు దిగడం సరైంది కాదు.. తెలంగాణలో ఈ పద్ధతి ఎప్పుడూ లేదు.. మొదటిసారి జరిగింది.. ప్రభాకర్ రెడ్డి చాలా సౌమ్యుడు.. చీమకి కూడా హాని తలపెట్టని వ్యక్తి అని మంత్రి అన్నారు. గన్ మెన్ అప్రమత్తతో ప్రాణహాని తప్పింది.. పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలి కానీ… భౌతిక దాడులు సరైంది కాదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Read also: MP GVL Narasimha Rao: ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలు.. రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి ప్రపంచమే చెప్పుకుంటోంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభాకర్ రెడ్డికి పెద్ద గాయం అయ్యింది.. అయిదు గంటలుగా సర్జరీ జరుగుతోంది అంటేనే అర్థం చేసుకోవాలి.. ప్రభాకర్ రెడ్డిపై దాడిని అంత ఆషామాషీ గా తీసుకోకూడదు.. ఈ దాడితో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో భయాందోళన నెలకొంది.. ఎలక్షన్ కమీషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.. అభ్యర్థులకు భద్రత కల్పించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాన్ని ఉంచాలి.. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.