NTV Telugu Site icon

Minister Sudhakar : బ్రహ్మానందం ప్రచారం చేసిన ఓడిన మంత్రి సుధాకర్

Bramhanandam

Bramhanandam

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పాల్గొన్నారు. బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున ఆయన నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి సుధాకర్ ఓటమి పాలయ్యారు. 11 వేల 130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ అక్కడ విజయం సాధించారు.

Also Read : Hyderabad : హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు..

చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ కు 69 వేల 8 ఓట్లు రాగా, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కు 57 వేల 878 ఓట్లు వచ్చాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచేగౌడకు కేవలం 13 వేల 300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు.

Also Read : IB 71: మరోసారి నిరాశ పరిచిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్

అయితే నాడు సుధాకర్ గెలిచారు. కాగా.. ఇదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేయాలనే ఉద్దేశంతో.. సుధాకర్ తన స్నేహితుడైన తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందంతో చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు ప్రచారం చేయించారు. కానీ ఈ సారి సెంటిమెంట్ రిపీట్ కాలేదు. చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉండటంతో బ్రహ్మానందం తెలుగు భాషలోనే సినిమా పంచ్ లు పేల్చారు.. కామెడీ చేశారు.. ఓటర్లను ఆకర్షించారు. అయినా ఆరోగ్యమంత్రిగా ఉన్నా సుధాకర్ కు మాత్రం ఓటమి తప్పలేదు.