NTV Telugu Site icon

Minister Srinivas Goud: కల్లు అన్ని రకాల ఔషధంగా ఉపయోగపడుతుంది

Srinivas Goud

Srinivas Goud

సిరిసిల్ల అంటేనే గీతన్న, నేతన్న.. ఉదయం కష్టపడే గీతన్న సాయంత్రం గీతన్నను కలుస్తాడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవుడు తాగే అమృతంను గీతన్న అందిస్తున్నాడు.. నేతన్న పని చేసి కష్టపడి ఆకలితో అనాడు చనిపోయారు.. గీతన్నలు కూడా ప్రమాదవాత్తూ చాలా మంది చనిపోయారు.. అనాడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. నేడు వృత్తులు కులాలు అయ్యాయి.. మళ్ళీ ఉప కులాలు అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు.

Read Also: India vs Ireland: బ్యాడ్ న్యూస్.. భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వరుణుడు అడ్డంకి..?

కల్లు అన్ని రకాలుగా ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది.. తాటి ముంజలలో కాల్షియం ఉంటుంది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంటరానితానం ఉన్నప్పుడు కూడా గౌడ కులస్తుల దగ్గర ఎలాంటి కులం లేదు.. తాగే వద్ద ఎలాంటి కులం ఉండదు.. తెలంగాణ రాక ముందు ఎలా ఉండేది గౌడ కులస్తులు ఆలోచన చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ అడిగారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు.. గౌడ్ కులస్తులకు సెల్ఫ్ రెస్పెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని మంత్రి అన్నారు. మేము ఇచ్చే నీరాను బెంజ్ కారులో వచ్చి తాగుతున్నారు.. 9 ఏళ్లలో గౌడ కులస్తులు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు.

Read Also: Minister KTR: టాటా బిర్లా కాదు తాతల నాటి కుల వృత్తులు బాగుండాలి

70 వేల మంది గీత కార్మికులను తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇంస్తుదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వైన్స్ టెండర్లలో రిజర్వేషన్ ఇచ్చారు.. 500 కోట్ల విలువైన భూమిని గౌడ కులస్తులకు హైదరాబాద్ లో ఇచ్చారు.. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల అభివృద్ధి చెందింది.. కరీంనగర్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి కలం నాదే అంటూ ఆప్యాయతగా కేటీఆర్ దగ్గరికి తీసుకుంటున్నాడు.. కేటీఆర్ కి.. సిరిసిల్లకి పేగు బంధం ఉంది అని ఎక్సైజ్ మంత్రి తెలిపాడు. సిరిసిల్లలో కేటీఆర్ ఉండడం సిరిసిల్ల ప్రజల అదృష్టమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక కులంకి, ఒక మతంకి అంకితం కాదు.. అన్ని కులాలు, అన్ని మతాలకు నిలయం అని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.