Site icon NTV Telugu

Srinivas Goud : ఆనాడు బతుకమ్మ అడుతుంటే మైక్‌లకు పర్మిషన్ కూడా ఇవ్వలే

Srinivas Goud

Srinivas Goud

ట్యాంక్ బండ్‌పై తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ బతుకమ్మ వేడుకల్లో బాణసంచా పేలుళ్లు అందరి దృష్టి ఆకర్షించాయి. అయితే.. ప్రభుత్వం తరుపున మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, టూరిజం కార్పొరేషన్ ఎండి, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆనాడు బతుకమ్మ ఆడుతుంటే మైక్‌లకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం, దేశం బాగుపడాలని కేసీఆర్ సంకల్పించారని, దేశం,రాష్ట్రం, ఇంట్లో ఆడపిల్లలు బాగుంటే దేశం బాగుంటుందని ఆయన అన్నారు.

 

కేసీఆర్ ఏ పని చేయాలకున్న అది సక్సెస్ అవుతుందని, పైన ఉన్న భగవంతుని ఆశీస్సులు మనపై ఉన్నవన్నారు. భవిష్యత్ లో ప్రతి కుటుంబం మంచిగా ఉండలని కోరుకుంటున్నానని, గతంలో దుఃఖంతో ఉండే వాళ్ళం.. తెలంగాణ వచ్చాక అంత మార్చారు కేసీఆర్.. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేస్తున్నారు…. అద్భుతమైన పథకాలు ఇంకా రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

Exit mobile version