Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : మొదటిసారి జపాన్‌ ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఇండియన్ పెవిలియన్

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జపాన్ పర్యటనలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం ఈ పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవబోయే కార్యక్రమం జపాన్‌లో తొలిసారిగా నిర్వహించబోయే ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పో. ఈ ఎక్స్ పోలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండియన్ పెవిలియన్‌లో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తమ తమ ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నాయి.

ఈ పెవిలియన్‌ను అన్ని రాష్ట్రాలు సంయుక్తంగా వినియోగించుకుంటూ, ప్రతి రాష్ట్రానికి రోజు వారీగా టైమ్ స్లాట్ కేటాయించనున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా రెండు రోజుల పాటు అవకాశం లభించింది. ఈ సందర్భంగా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియజేయనున్నారు. ఈ ఎక్స్ పోకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. కేంద్రం కేటాయించిన పెవిలియన్‌లో తెలంగాణ ప్రభుత్వ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడుల రాబాటలో కీలకంగా మారే అవకాశం ఉంది.

ఇక మరోవైపు, ఇటీవల వైరల్ అయిన హెచ్సీయూ భూముల అంశం గురించి మీడియా ప్రశ్నించగా, మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ … “ఆ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి నేను దానిపై మాట్లాడలేను,” అని పేర్కొన్నారు.

Khadar Bhasha: టీడీపీ, జనసేన పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడాలి..

Exit mobile version